మస్కట్ ఎయిర్పోర్ట్ పార్కింగ్ ఏరియా పెంపు
- February 10, 2016
మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పార్కింగ్ ఏరియాను పెంచారు. ఫిబ్రవరి 15న ఈ కొత్త పార్కింగ్ ఏరియాను ప్రారంభించనున్నట్లు ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ (ఓఎఎంసి) వెల్లడించింది. ప్రస్తుతం వున్న చెల్లింపు విధానాన్ని కూడా మెరుగు పరిచారు. తొలి 24 గంటలకు గాను పార్కింగ్ రుసుము 3 ఒమన్ రియాల్స్‌గా నిర్ణయించారు. రెండో రోజుకి 4 ఒమన్ రియాల్స్, మూడో రోజుకి 5 ఒమన్ రియాల్స్, 4వ రోజుకి 6 ఒమన్ రియాల్స్ వసూలు చేస్తారు. ఫిబ్రవరి నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. 5వ రోజు తర్వాత ప్రతిరోజుకీ 7 ఒమన్ రియాల్స్ వసూలు చేయడం జరుగుతుంది. మస్కట్ ఇంటర్నేషనల్ విమానాశ్రయ వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ఒమన్ ఎయిర్‌పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి 670 కొత్త లాంగ్ టర్మ్ పార్కింగ్ స్పేస్‌లను అందుబాటులోకి తెచ్చామనీ, ముందు ముందు ఈ సంఖ్య ఇంకా పెంచుతామని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







