మద్యం తరలిస్తున్న సౌదీ మహిళ ఆమె డ్రైవర్ పట్టివేత

- February 11, 2016 , by Maagulf
మద్యం తరలిస్తున్న సౌదీ మహిళ  ఆమె డ్రైవర్ పట్టివేత

మహిళతో ప్రయాణిస్తే పోలిసుల తనిఖీ నుంచి తప్పుకోవచ్చు అనే వారి అతి తెలివి  బెడిసికొట్టింది. రెడ్ హండేడ్ గా   1500 మద్యం సీసాలతో ఒక యజమానురాలు , ఆమె డ్రైవర్ అడ్డంగా దొరికిపోయారు. సౌదీ మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఒక సౌదీ మహిళ బహేరిన్లో  ఒక పడవ నుంచి మద్యం సీసాలను తన 4 x 4 కారులోనికి  మార్చుకొని కింగ్ ఫహేడ్ కాజ్ వే మార్గంలో వేగంగా ప్రయాణిస్తూ ఆసియా దేశానికి చెందిన తన డ్రైవర్ తో సహా పోలీసులకు పట్టుబడ్డారు. అంతకు మునుపు కస్టమ్స్ యొక్క సాధారణ తనిఖీలో బాగంగా సముద్రంలో ఒక పడవను నిలిపి సోదా జరుపుతున్న  సమయంలో స్కానర్లు పడవ అడుగు భాగంలో ఏదో రహస్యంగా  దాచబడినట్లు  సంకేతం ఇవ్వడంతో క్షుణంగా పరిశీలించిన తనిఖీ అధికారులు పడవకు  8 అడుగుల దిగువ భాగంలో ఒక రహస్య అరలో 1504 మద్యం సీసాలు  అక్రమంగా దాచి మరో ప్రాంతంలో డెలివరీకు సిద్ధపడుతున్న సమయంలో కస్టమ్స్ పోలీసులకు చిక్కారు. విచారణలో తమ మద్యం సీసాల సరుకు డెలివరీ  వివరాలు సౌదీ మహిళ ఏ విధంగా తమ వద్ద నుంచి తీసుకువెళ్లిందో పడవలోని  వారు పూస గుచ్చినట్లు వివరించారు. దీంతో ఆ మహిళా ప్రయాణిస్తున్న కారు రంగు, నెంబర్, మనుష్యుల ఆనవాళ్ళు తదితర  వివరాలతో సహా స్థానిక  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు  కింగ్ ఫహేడ్ కాజ్ వే పై వీరి కోసం ఎదురుచూస్తున్న సమయంలో  యజమానురాలు , డ్రైవర్  ' మద్య ప్రయాణానికి '  మధ్యలోనే  ఫుల్ స్టాప్ పడింది. గత జనవరి మాసాంతంలో బహెరిన్ నుంచి సౌదీకు వస్తున్న ఒక ప్రయాణికుడి నుంచి 430 మద్యం సీసాలు  ( 83 లీటర్లు ) పట్టుకొన్న సంగతిని ఈ సందర్భంగా పోలీసులు గుర్తు చేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com