'బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల
- September 22, 2020
హైదరాబాద్:కామెడీ హీరో షకలక శంకర్ లీడ్ రోల్ లో మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్ సమర్పణ లో రూపొందిన అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటెర్టైనెర్ మూవీ "బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది. టైటిల్ తోనే అటు మాస్ ఆడియెన్స్ లో ఇటు క్లాస్ అడియెన్స్ లో అనూహ్య స్పందన తెచ్చుకున్న ఈ చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇక ఈ సినిమాతో కుమార్ కోట దర్శకునిగా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు. మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఫుల్ కామెడి అండ్ రొమాంటిక్ ఎంటరైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా నిర్మాతలు లుకాలపు మధు, దత్తి సురేష్ బాబు, సోమేశ్ ముచర్ల తెలిపారు. షకలక శంకర్ నుంచి ఆడియన్స్ ఎక్సపెక్ట్ చేసే కామెడి తో పాటు మరి కొన్ని థ్రిల్ ఎలెమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నట్లుగా చెబుతున్నారు దర్శకుడు కుమారు కోట. షకలక శంకర్ తో పాటు ప్రియ, అర్జున్ కళ్యాణ్, రాజు స్వరూప్, స్వాతి తదితరులు కీలక పాత్రలు చేసిన ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ లుక్ తాజగా గా విడుదల అయింది. బొమ్మ అదిరింది దిమ్మ తిరిగింది అనే అర్ధం లో ఎంత ఫన్ ఉందో ఫుల్ సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతుంది అని చిత్ర బృందం కాన్ఫిడెంట్ గా చెబుతుంది. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సందర్బంగా
దర్శకుడు కుమార్ కోట మాట్లాడుతూ
బొమ్మ అదిరింది - దిమ్మ తిరిగింది డైరెక్టర్ గా నా తొలి సినిమా, ఈ సినిమాని ఓ అవుట్ అండ్ అవుట్ కామెడీ అండ్ రొమాంటిక్ కమర్షియల్ స్టోరీ తో తెరకెక్కించాము. షకలక శంకర్ మార్క్ కామెడీ అండ్ యాక్షన్, ఆడియన్స్ ని తప్పకుండా అలరిస్తుంది అని ఆశిస్తున్నాను.
నిర్మాతలు లుకాలపు మధు, దత్తి సురేష్, సోమేశ్ ముచుర్ల మాట్లాడుతూ
కొత్త దర్సకుడు కుమార్ కోట, ఈ కథను చక్కగా తెరకెక్కించాడు. సినిమా ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ ఉండే రీతిన డైలాగ్స్ కూడా బాగా కుదిరాయి. శంకర్ యాక్షన్, కామెడీ తదితర అంశాలు ఈ చిత్రానికి హైలైట్ అవనున్నాయి అని తెలిపారు.
నటీనటులు
షకలక శంకర్
ప్రియ
అర్జున్ కళ్యాణ్
రాజ్ స్వరూప్
మధు
స్వాతి
అవంతిక
హీనా
రితిక చక్రవర్తి
సంజన చౌదరి
సాంకేతిక వర్గం
సమర్పణ : మహంకాళి మూవీస్, మహంకాళి దివాకర్
బ్యానర్ : మణిదీప్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాతలు : లుకాలపు మధు, దత్తి సురేష్ బాబు, సోమేశ్ ముచ్చర్ల
పీఆర్ఓ : మేఘశ్యామ్, లక్ష్మీ నివాస్
కెమెరామెన్ : ఫణింద్ర వర్మ అల్లూరి
మ్యూజిక్ : పిఆర్
స్టోరీ, డైలాగ్స్ : విఎస్ రావ్
డైరెక్టర్ : కుమార్ కోట
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?