తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,278 కరోనా కేసులు నమోదు..

- September 23, 2020 , by Maagulf
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 2,278 కరోనా కేసులు నమోదు..

హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో నిన్నరాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో కొత్త 2,278 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,77,070కి చేరుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. కాగా కరోనాతో నిన్న 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా మృతులు 1,062. నిన్న కోలుకున్న వారు 2,062మంది. దీంతో కోలుకున్న బాధితుల సంఖ్య 1,46,135కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 29,873. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నవారు 23,527 మంది అని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com