కోవిడ్ 19:6వ గ్రేడ్ నుంచి పై తరగతుల విద్యార్ధులకు 100% ఆన్ లైన్ లోనే పాఠాలు

- September 23, 2020 , by Maagulf
కోవిడ్ 19:6వ గ్రేడ్ నుంచి పై తరగతుల విద్యార్ధులకు 100% ఆన్ లైన్ లోనే పాఠాలు

అబుధాబి:ఉన్నత పాఠాశాల విద్యార్ధుల విద్యా విధానంపై అబుధాబి విద్యాశాఖ అధికారులు స్పష్టత ఇచ్చారు.ఆరు అంతకు మించి గ్రేడ్ విద్యార్ధులకు వంద శాతం ఆన్ లైన్ లోనే పాఠాలు బోధించనున్నట్లు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో ప్రతీ విద్యార్ధి, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కోవిడ్ నియంత్రణ చర్యలను పర్యవేక్షిస్తున్న అత్యవసర, విపత్తు నిర్వహణ కమిటీ తెలిపింది. అయితే..9వ గ్రేడ్ నుంచి 12వ గ్రేడ్ విద్యార్ధులు మాత్రం వ్యక్తిగతంగా తరగతులు హజరవుతారా...ఈ-లెర్నింగ్ వైపు మొగ్గు చూపుతారా అనేది వాళ్లే నిర్ణయించుకునే అవకాశం కల్పించారు. వివిధ యూనివర్సిటీలు, అంతర్జాతీయ పరీక్షలకు హజరవుతారు కనుక ఇష్టం ఉన్నవారు వ్యక్తిగతంగా తరగతులకు హజరయ్యేందుకు ఆమోదం తెలిపారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com