కువైట్‌ హాస్పిటల్‌లో కొట్లాట: 15 మంది అరెస్ట్‌

- September 23, 2020 , by Maagulf
కువైట్‌ హాస్పిటల్‌లో కొట్లాట: 15 మంది అరెస్ట్‌


కువైట్ సిటీ‌: కువైట్‌లోని ముబరక్‌ అల్‌ కబీర్‌ ఆసుపత్రిలో జరిగిన ఓ ఘర్షణకు సంబంధించి 15 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పదునైన ఆయుధాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటనకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి చెందిన ఆపరేషన్స్‌ రూమ్ కి ఫిర్యాదు అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. మరికొంతమంది సంఘటనా స్థలం నుంచి పారిపోయారనీ, వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com