ఎస్‌ఎంఎస్ ఫ్రాడ్: గ్యాంగ్‌ని అదుపులోకి తీసుకున్న పోలీస్
- September 23, 2020
యూఏఈ రెసిడెంట్ ఒకర్ని ఎస్‌ఎంఎస్ ఫ్రాడ్ ద్వారా దోచుకునేందుకు యత్నించిన గ్యాంగ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్‌లో మొత్తం 9 మంది సభ్యులు వున్నట్లు తెలిపారు పోలీసులు. బ్యాంక్ రిప్రెజెంటేటివ్స్‌గా చెప్పుకుంటూ నిందితులు, ఎస్‌ఎంఎస్‌లు పంపి, వినియోగదారుల నుంచి పెద్దమొత్తంలో నగదు దోచుకుంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులు 96,000 దిర్హామ్ల మొత్తానికి మోసం చేసేందుకు యత్నించినట్లు అధికారులు వివరించారు. సెంట్రల్ రీజియన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ యాక్టింగ్ డైరెక్టర్ కల్నల్ హమాద్ అల్ రియామి మాట్లాడుతూ విచారణ సందర్భంగా గ్యాంగ్ వ్యూహాల్ని కనుగొన్నామనీ, నిందితుల్ని అరెస్ట్ చేశామనీ, వారి దగ్గరనుంచి పెద్ద సంఖ్యలో ఫోన్లు, చిప్స్ స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ తరహా మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన