కోవిడ్ 19: ఎన్ఆర్ఐలకు రస్ ఆల్ ఖైమా ఉదారత..ప్రయాణ ఖర్చులు భరిస్తున్న ఎమిరేట్
- September 23, 2020
రస్ ఆల్ ఖైమాలోని ప్రవాస భారతీయులు భద్రంగా స్వదేశం చేరుకూనేందుకు ఎమిరాతి ప్రభుత్వం తమ ఉదారతను చాటుకుంది. కోవిడ్ 19 సంక్షోభంతో భారత్ వెళ్లాలనుకుంటున్న వారి విమాన ప్రయాణ ఖర్చులను ప్రభుత్వం భరిస్తోంది. గత జూన్ నుంచి ఇప్పటివరకు దాదాపు 53 వేల మందిని ఉచితంగా భారత్ కు తరలించింది. లాక్ డౌన్ పరిస్థితులతో ఎమిరేట్ లో చిక్కుకుపోయిన వారిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్ లో భాగస్వామ్యం అవుతూ భారత ప్రభుత్వం, ఇండియన్ ప్రైవేట్ ఎయిర్ వేస్ స్పైస్ జెట్ తో కలిసి రస్ ఆల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయ అధికార వర్గాలు ప్రవాస భారతీయులను తరలించటంలో నిర్విరామంగా కృషి చేశాయి. యూఏఈ వ్యాప్తంగా జాబ్ కాంట్రాక్ట్ గడువు ముగిసిన వారిని, సంక్షోభం నేపథ్యంలో ముందుగానే కాంట్రాక్ట్ ముగించుకోవాల్సి వచ్చిన వారిపై ఆర్ధిక భారం పడకుండా ప్రత్యేక విమానాల ద్వారా ఉచితంగా స్వదేశానికి పంపించాలని ఆదేశించిన యూఏఈ కౌన్సిల్ సభ్యుడు, రస్ ఆల్ ఖైమా పాలకుడు షేక్ సౌద్ బిన్ సక్ర్ అల్ ఖాసిమికి ప్రవాస భారతీయులు కృతజ్ఞతలు తెలిపారు. భారత ప్రభుత్వం, ఆ దేశ ప్రజలతో తమకు చిరకాల మిత్రత్వం ఉందని, మిత్రదేశ పౌరుల భద్రతను తమ బాధ్యతగా భావించి వందే భారత్ మిషన్ లో తాము కూడా భాగస్వామ్యం అయినట్లు షేక్ సౌద్ అన్నారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు