'గిఫ్ట్ ఏ స్మైల్' అంబులెన్స్ వాహనాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
- September 24, 2020
హైదరాబాద్:తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ & చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్అం దించిన రెండు అత్యాధునిక సదుపాయాలు కలిగిన ఆంబులెన్స్ లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ & ఐటీ , మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో ఒక ఆంబులెన్స్ చెన్నూర్ నియోజక వర్గంలోని మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీలు, మందమర్రి మండల ప్రజలకు అందుబాటులో ఉండనుండగా.. మరొక్క ఆంబులెన్స్ కోటపల్లి, చెన్నూర్(మండల & పట్టణం), భీమారం, జైపూర్ మండలాల ప్రజలకు సేవలు అందించనుంది. అత్యంత అధునాతనమైన ఈ ఆంబులెన్స్ లో ఆక్సిజెన్, వెంటిలేటర్ల సదుపాయం కూడా ఉంది. కోవిడ్ మరియు ప్రజా అవసరాల రిత్యా బాల్క సుమన్ రెండు ఆంబులెన్స్ అందించడం పట్ల కేటీఆర్ వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చెన్నూర్ ప్రజలకు రెండు అధునాతన ఆంబులెన్స్ అందుబాటులోకి రావడంతో ప్రజలకు అత్యవసర సమయంలో మెరుగైన వైద్యం అందించడానికి దోహదపడనున్నాయి. రెండు అంబులెన్స్ అందించి తన దాతృత్వాన్ని చాటిన ఎమ్మెల్యే బాల్క సుమన్ పై చెన్నూర్ నియోజక వర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







