బహ్రెయిన్:ఫేస్ మాస్క్ లేకుంటే స్పాట్ లోనే ఫైన్..
- September 24, 2020
మనామా:ఇక నుంచి బహ్రెయిన్ లో పర్యటించే ప్రతి ఒక్కరు ఫేస్ మాస్క్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. లేదంటే ఆన్ ది స్పాట్ 20 దినార్ల జరిమానా చెల్లించాలి. బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. బహ్రెయిన్ లోని పబ్లిక్ ప్లేసులు, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాలు, షాపింగ్ మాల్స్ ఇలా బహిరంగ ప్రాంతాల్లో ప్రతీ చోట ఫేస్ మాస్కులుs ఖచ్చితంగా ధరించాలని మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. కరోనా వ్యాప్తి నియంత్రణ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేసేందుకు ఫేస్ మాస్క్ విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఎవరైనా మాస్క్ ధరించకుండా కనిపిస్తే అక్కడి జ్యూడిషియల్ అఫీసర్ 20 దినార్ల ఫైన్ విధించి, అక్కడికక్కడే ఫైన్ వసూలు చేస్తారు. నిబంధనల ఉల్లంఘించినట్లు రికార్డ్ చేసుకొని ఫైన్ చెల్లించినట్లు రశీదు కూడా ఇస్తారు. ఒకవేళ ఎవరైనా ఫైన్ చెల్లించేందుకు నిరాకరించినా, ఫైన్ చెల్లించలేకపోయినా వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు తరలిస్తారు. కరోనా నిబంధనల అమలు, ఫైన్ విధింపు విధులను జ్యూడిషియల్ అధికారులే కాకుండా పబ్లిక్ సెక్యూరిటీ ఫోర్స్ లో విధులు నిర్వహించే సిబ్బంది కూడా ఫైన్ విధించేలా అధికారులను ఇచ్చారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..