టూరిస్ట్ వీసాల జారీ షురూ..అబుధాబితో సహా 5 ఎమిరేట్స్ లో పర్యాటకులకు అనుమతి

- September 24, 2020 , by Maagulf
టూరిస్ట్ వీసాల జారీ షురూ..అబుధాబితో సహా 5 ఎమిరేట్స్ లో పర్యాటకులకు అనుమతి

అబుధాబి:కోవిడ్ కల్లోలం తర్వాత దశల వారీగా మళ్లీ సాధారణ పరిస్థితులను నెలకొల్పే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్న యూఏఈ..ఇప్పుడు పర్యాటక రంగం వైపు దృష్టి సారించింది. యూఏఈ పర్యాటక రంగానికి ఊతం ఇచ్చేలా టూరిస్ట్ వీసాల జారీని పునరుద్ధరించింది. అబుధాబితో సహా ఐదు ఎమిరాతిలలో పర్యాటకులకు అనుమతి ఇస్తూ గురువారం నుంచే టూరిస్ట్ వీసాలను జారీ చేస్తోంది. అయితే..వర్క్ పర్మిట్ వీసాలు మినహా టూరిస్ట్ వీసాలను తేలికగానే పొందవచ్చని కేంద్ర పౌర గుర్తింపు మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. కుటుంబాలతో వచ్చే పర్యాటకులు, ఎమిరాతిలో ఉండే బంధువుల దగ్గరికి వచ్చే వారికి కూడా టూరిస్ట్ వీసాలను ఇస్తున్నట్లు తెలిపింది. అయితే..కోవిడ్ నేపథ్యంలో యూఏఈ వచ్చి వెళ్లే పర్యాటకుల విషయంలో ఒక్కో ఎమిరాతి అధికారులు ప్రత్యేక నిబంధనలను అమలు చేస్తున్నారు. అబుధాబికి వచ్చే పర్యాటకులు 14 రోజుల పాటు బంధువుల ఇళ్లలో గానీ, హోటల్ రూమ్స్ లో గానీ క్వారంటైన్ లో ఉండాలి. ఈ 14 రోజుల క్వారంటైన్ సమయంలో పర్యాటకుల కదలికలను పర్యవేక్షించేందుకు ఎలక్ట్రానిక్ ట్యాగ్ వేస్తారు. ఇక షార్జాలో పర్యటించే పర్యాటకులు కోవిడ్ 19 నిర్ధారణకు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలి. రిజల్ట్ వచ్చే వరకు క్వారంటైన్ లో ఉండాలి. నెగటీవ్ ఉన్నట్లు రిజల్ట్ వస్తే వారు షార్జాలో ఎక్కడైనా స్వేచ్ఛగా పర్యటించొచ్చు. ఇదిలాఉంటే..సొంత ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ, కోవిడ్ ను ఎదుర్కొనేందుకు ప్రత్యేక అధికార విభాగం కలిగిన దుబాయ్ మాత్రం గత జులై నుంచి పర్యాటకులకు అనుమతి ఇచ్చింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com