విశ్వేశ్వరయ్య అవార్డులను అందజేసిన టి.హోంమంత్రి...
- September 25, 2020
హైదరాబాద్:వృత్తిలో ప్రతిభ కనబరిచిన ఇంజనీర్లకు విశ్వేశ్వరయ్య అవార్డులను శుక్రవారం నాడు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అందజేశారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 161 జయంతి సందర్భంగా అవార్డులను హైదరాబాదులో మినిస్టర్ క్వార్టర్స్‌లో మెగా సిటీ కళావేదిక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ ఇంజనీర్ గా ఉత్తమమైన సేవలందించి ప్రసిద్ధి చెందిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరిట అవార్డులను అందజేయడం అభినందనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం పలు రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ,ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజనీర్లు ప్రముఖ పాత్ర వహించారని తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆశయాలకు అనుగుణంగా ఇంజనీర్లు పని చేయడం వల్ల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు విద్యుత్ మరియు ఇతర రంగాలలో ఇంజనీర్లు చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉందన్నారు. వీరిని ప్రోత్సహించేందుకు భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా అవార్డులను అందజేయడం సమంజసమని అభిప్రాయపడ్డారు. జె.రాజేష్ నేత, ప్రొఫెసర్ డీకే రెడ్డి, మల్లికార్జున్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్‌పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్‌పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్‌లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్‌లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







