బాల సుబ్రహ్మణ్యం మరణం మాకు తీరని లోటు - టీమ్ ఆదిత్య మ్యూజిక్
- September 26, 2020_1601117751.jpg)
హైదరాబాద్ :గాన గంధర్వడు ప్రముఖ గాయకలు బాల సుబ్రహ్మణ్యం సెప్టెంబర్ 25 మధ్యాహ్నం 1 గం 4 నిలకు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అదిత్య మ్యూజిక్ సంస్థ అధినేత ఉమేశ్ గుప్త, మాట్లాడుతూ, బాలుగారు ఇక లేరనే వార్త మాకు, మా ఆదిత్య మ్యూజిక్ సంస్థ సిబ్బందితో పాటు యావత్ ప్రపంచంలో ఉన్న సంగీత అభిమానుల్ని దిగ్భ్రాంతికి లోను చేసింది. దాదాపు 50 ఏళ్లుగా సంగీత ప్రపంచానికి ఆయన అందించి సేవలు అనితర సాధ్యం. తెలుగులో ఆయన పాడిన పాటల్లో కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ మా ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల చేసే అదృష్టం దక్కింది. అటు సినిమా పాటలు పాడుతూనే ఇటు భక్తిరస పాటలు కూడా ఆలపించేవారు బాలు. అలా ఆయన పాడిన భక్తి రస పాటల్లో మా సంస్థ ద్వారా విడుదల చేసిన హనుమాన్ చాలీసా, శివోహం వంటి మొదలగు పాటలు విశేష ఆదరణ సంపాదించుకున్నాయి. మూడు దశాబ్ధలు నుంచి బాలుగారుతో ఆదిత్య మ్యూజిక్ సంస్థ ప్రయాణం కొనసాగుతోంది. ఆయన మరణం మాకు, మా ఆదిత్య మ్యూజిక్ సంస్ధకు తీరని లోటుగా భావిస్తున్నాము. అయితే బాలు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన అద్భుతమైన గాత్రం ద్వారా మనందరితోనే ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనఃస్పూర్తిగా ఆ దేవుడుని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?