తెలంగాణ ముద్దుబిడ్డ పైడి జయరాజ్ 111వ జయంతి ఉత్సవాలు!!

- September 28, 2020 , by Maagulf
తెలంగాణ ముద్దుబిడ్డ పైడి జయరాజ్ 111వ  జయంతి  ఉత్సవాలు!!

హైదరాబాద్:పైడి జయరాజ్ 111 వ జయంతి ఉత్సవాలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో.. తెలంగాణ ఎక్సైజ్ మినిష్టర్ శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా... జై తెలంగాణ ఫిల్మ్ జేఏసీ చైర్మన్ పంజాల జైహింద్ గౌడ్   సారధ్యంలో ఘనంగా జరిగాయి. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు మనవడు ఎన్.వి.సుభాష్, ఎం.ఎల్.సి. నారపురాజు రామచంద్రరావు, ప్రముఖ నటులు-మాజీ మంత్రివర్యులు బాబు మోహన్, తెలుగు నిర్మాతల మండలి ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రసన్న కుమార్, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్  అధ్యక్షులు మోహన్ గౌడ్, యువ కథానాయకుడు పంజాల శ్రావణ్ కుమార్ గౌడ్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని పైడి జయరాజ్ కి ఘన నివాళులర్పించారు.

భారతీయ సినిమాకు పైడి జయరాజ్ అందించిన సేవలకు తగ్గట్టుగా ఆయన పేరు తెలుగు చిత్ర పరిశ్రమలో మరింత మారుమ్రోగేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణాలో సినిమా పరిశ్రమకు ఇచ్చే అవార్డులు పైడి జయరాజ్ పేరిట ఇవ్వాలని, హైదరాబాద్-కరీంనగర్ హైవేకి పైడి జయరాజ్ హైవేగా నామకరణం చేయాలని పంజాల జైహింద్ గౌడ్ పిలుపునిచ్చారు!!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com