హెల్త్‌ ప్రోటోకాల్స్‌ ఉల్లంఘన: 10 ఎస్టాబ్లిష్‌మెట్స్‌కి జరీమానా

- September 29, 2020 , by Maagulf
హెల్త్‌ ప్రోటోకాల్స్‌ ఉల్లంఘన: 10 ఎస్టాబ్లిష్‌మెట్స్‌కి జరీమానా

దుబాయ్‌: దుబాయ్‌ ఎకానమనీ, కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌పై నిరంతర తనిఖీల్ని కొనసాగిస్తోంది. హెల్త్‌ ప్రోటోకాల్స్‌ విషయమై తనిఖీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 10 ఎస్టాబ్లిష్‌మెంట్స్‌కి జరీమానా విధించగా, 11 షాప్స్‌కి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అయితే, ఒక్క షాప్‌ కూడా మూసివేత దిశగా నిర్ణయం తీసుకోలేదు అధికారులు. 643 కమర్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ పూర్తిస్థాయిలో నిబంధనల్ని పాటిస్తున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. దుబాయ్‌ కన్స్యూమర్‌ యాప్‌ అందుబాటులో వుంటుందనీ, ఎవరైనా ఉల్లంఘనలను గుర్తిస్తే ఫిర్యాదు చేయవచ్చునని అధికారులు పేర్కొన్నారు. 600545555 నెంబర్‌కి ఫోన్‌ చేసి కూడా ఫిర్యాదు చేయొచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com