కువైట్: అక్టోబర్ 2 వరకు ఇండియన్ ఎంబసీ, పాస్ పోర్ట్ కేంద్రాల మూసివేత
- September 30, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని భారత్ రాయబార కార్యాలయంలో అక్టోబర్ 2 వరకు ప్రజా సేవలను నిలిపివేశారు. అలాగే షార్క్, ఫహహీల్, అబ్బాసియాలో ఉన్న పాస్ పోర్ట్ కార్యాలయాలను కూడా మూడ్రోజుల పాటు మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కువైట్ అమీర్ షేక్ సాబా అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సాబా మృతికి సంతాపంగా మూడ్రోజులు ఆయా కార్యాలయాలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే అత్యవసర కాన్సులర్ సేవలు మాత్రం యధావిధిగా కొనసాగుతాయని వెల్లడించారు. ఇదిలాఉంటే..భారత ప్రభుత్వం, భారత ప్రజల తరపున కువైట్ అమీర్ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు రాయబార కార్యాలయం తెలిపింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష