భారత్ లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- September 30, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా కేసులు రోజుకో రకంగా నమోదవుతున్నాయి. ఒక్కో రోజు ఎనబై వేలకు పైగా కేసులు బయటపడగా.. ఒక్కోసారి మాత్రం 70 వేలకు పరిమితం అవుతున్నాయి. నిన్న దాదాపు 70 వేల మందికి పైగా కరోనా బారినపడగా.. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. కొత్తగా 80,472 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య సంఖ్య 62,25,764కు చేరింది. అయితే, ఇందులో 51,87,826 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇంకా 9,40,441 మంది చికిత్స పొందుతున్నారు. అటు, గడిచిన 24 గంటల్లో కరోనా మరణాలు కూడా నిన్నటి కంటే ఎక్కువగానే నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 1179 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం మృతుల సంఖ్య 97,497కు చేరింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







