స్నాప్‌చాట్‌ అకౌంట్‌తో నెంబర్‌ ప్లేట్‌ రీప్లేస్‌ చేసిన మోటరిస్ట్‌

- September 30, 2020 , by Maagulf
స్నాప్‌చాట్‌ అకౌంట్‌తో నెంబర్‌ ప్లేట్‌ రీప్లేస్‌ చేసిన మోటరిస్ట్‌

రియాద్ :సౌదీ పోర్ట్‌ సిటీ జెడ్డాలో ఓ మోటరిస్ట్‌ తన వాహన నెంబర్‌ ప్లేట్‌ని స్నాప్‌చాట్‌ అకౌంట్‌తో రీప్లేస్‌ చేసినట్లు ట్రాఫిక్‌ అధికారులు తెలిపారు. ఆ మోటరిస్ట్‌ని అథారిటీస్‌ అరెస్ట్‌ చేయడం జరిగింది. నిందితుడిపై నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, భారీ జరీమానా విధించే అవకాశముందని అధికారులు తెలిపారు. నంబర్‌ ప్లేట్‌ విషయమై ఎలాంటి ఆల్టరేషన్స్‌ జరిగినా అది నేరం కిందే పరిగణిస్తారు. అత్యధికంగా ఈ ఉల్లంఘనకు 2,000 సౌదీ రియాల్స్‌ జరీమానా విధించడం జరుగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com