ఏపీలో కొత్తగా 6,133 కరోనా పాజిటివ్ కేసులు
- September 30, 2020
అమరావతి:ఏపీలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే కొద్దిరోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 71,806 శాంపిల్స్‌ను పరీక్షించగా 6,133 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,93,484కి చేరింది. ఇందులో 58,445 యాక్టివ్ కేసులు ఉండగా.. 6,29,211 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు గడిచిన 24 గంటల్లో 48 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,828కు చేరుకుంది. నేటి వరకు రాష్ట్రంలో 58.06 లక్షల కరోనా టెస్టులు జరిగాయి.
నిన్న కోవిడ్ వల్ల చిత్తూరులో ఎనిమిది, ప్రకాశం జిల్లాలో ఆరుగురు, తూర్పుగోదావరి, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఐదుగురు చొప్పున.. అనంతపురం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున.. కడపలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 97 వేలు దాటగా.. చిత్తూరులో అత్యధికంగా 655 మంది కరోనాతో మరణించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







