పెట్రోలు ధరల్లో స్వల్ప పెరుగుదల

- September 30, 2020 , by Maagulf
పెట్రోలు ధరల్లో స్వల్ప పెరుగుదల


దోహా:ఖతార్‌ పెట్రోలియం, అక్టోబర్‌ కోసం పెట్రోల్‌ అలాగే డీజిల్‌ ధరల్ని ప్రకటించడం జరిగింది. పెట్రోల్‌ ధరల్ని కాస్త పెంచగా, డీజిల్‌ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రీమియం గ్రేడ్‌ పెట్రోల్‌ ధర లీటర్‌కి 1.25 ఖతారీ రియాల్స్‌ వుంటుంది. సెప్టెంబర్‌తో పోల్చితే ఈ ధర 5 దిర్హాములు ఎక్కువ. సూపర్‌ పెట్రోల్‌ ధర కూడా 5 దిర్హాములు పెంచారు. దీని ధర 1.30 ఖతారీ రియాల్స్‌కి చేరుకుంటుంది. డీజిల్‌ ధర మాత్రం 10 దిర్హాములు తగ్గింది. దీని ధర 1.15 ఖతారీ రియాల్స్‌గా వుండనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com