బహ్రెయిన్:మనీ లాండరింగ్ కు పాల్పడిన వ్యాపారవేత్తకు ఏడేళ్ల జైలు శిక్ష
- September 30, 2020
మనామా:అక్రమ లావాదేవీలు, ఆస్తుల అమ్మకాల్లో మోసాలకు పాల్పడుతున్న వ్యాపారవేత్తకు బహ్రెయిన్ అప్పీల్ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు BD1,00,000 జరిమానా విధించింది. డబ్బులు చెల్లించకుంటే దానికి సమానమైన అతని ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది. బహ్రెయిన్ కు చెందిన వ్యాపారవేత్త..సౌదీకి చెందిన వ్యక్తిని దాదాపు BD3 మిలియన్లు మోసం చేసినట్లు వచ్చిన ఆరోపణలు రుజువు కావటంతో అతనికి శిక్షను ఖరారు చేసింది. బహ్రెయిన్ లోని ఓ ఆఫీస్ బిల్డింగ్ ను నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సౌదీ వ్యక్తికి విక్రయించాడు. మోసపోయిన సౌదీ వ్యక్తి డబ్బులు చెల్లించిన తర్వాత అతను కొన్న బిల్డింగ్ వేరే వ్యక్తులదని...తనకు ఇచ్చిన డాక్యుమెంట్లు నకిలీవని గుర్తించినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే..శిక్షపడిన వ్యాపారవేత్త గతంలోనూ అక్రమ లావాదేవీలు నిర్వహించినట్లు అధికారులు చెబుతున్నారు. బహ్రెయిన్ నుంచి పారిపోయిన అతను పలు దేశాల్లో భవనాలు, నైట్ క్లబ్స్, స్టాక్స్ కొన్నాడని తెలిపారు. అయితే..విదేశాల్లోని ఆస్తుల్లో చాలావరకు కొల్పోయిన తర్వాత తిరిగి బహ్రెయిన్ కు చేరుకున్నాడు. 2008లో అతను అక్రమాలకు పాల్పడి సంపాదించిన BD3 మిలియన్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







