భారత ప్రధానితో ఫోన్ లో సంభాషించిన సౌదీ రాజు..పరస్పర సహకారంపై చర్చ
- September 30, 2020
రియాద్:సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్లాజిజ్..భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సౌదీ-భారత్ పరస్పర సహకారం, అభివృద్ధి వ్యూహాలపై చర్చించినట్లు అధికారులు వెల్లడించారు. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలోపేతం అయ్యే అవకాశాలతో పాటు సౌదీ-భారత్ వ్యూహాత్మక మండలి ద్వారా అభివృద్ధి కార్యచరణపై సమీక్షించినట్లు వివరించారు. గతేడాది సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ న్యూ ఢిల్లీలో పర్యటించిన సందర్భంగా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పెట్టుబడులు, విద్యుత్, సైనిక రంగాలకు సంబంధించి సహకరించుకునేలా పరస్పర అవగాహనకు వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు