తెలంగాణలో కొత్తగా 2,214 కరోనా కేసులు
- October 01, 2020
హైదరాబాద్:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న రాత్రి 8 గంటల వరకు 54,443 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,214 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,93,600 కి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం విడుదల చేసిన బులెటిన్లో పేర్కొంది. కరోనాతో నిన్న 8 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా మృతులు 1135కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న ఒక్కరోజే 2,474 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,63,407కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 29,058 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 23,702 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 30,50,444కి చేరింది. మరోవైపు GHMC పరిధిలో 305 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







