ప్రాపర్టీ డీల్స్‌పై కొత్త పన్ను, వ్యాట్‌ నుంచి మినహాయింపు.!

- October 02, 2020 , by Maagulf
ప్రాపర్టీ డీల్స్‌పై కొత్త పన్ను, వ్యాట్‌ నుంచి మినహాయింపు.!

రియాద్‌: సౌదీ అరేబియా కింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ డీల్స్‌ని 15 శాతం వ్యాట్‌ నుంచి మినహాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే, కొత్తగా 5 శాతం ట్యాక్స్‌ని ఆయా ట్రాన్సాక్షన్స్‌కి వర్తిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో మారిన ఆర్థిక పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫైనాన్స్‌ మినిస్టర్‌ ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. నాన్‌ ఆయిల్‌ రెవెన్యూస్‌ని పెంచేందుకోసం వ్యాట్‌ని 15 శాతానికి జులైలో పెంచారు. కాగా, కొత్త నిర్ణయంతో సిటిజన్స్‌కి ఊరట కలుగుతుందని ఫైనాన్స్‌ మినిస్టర్‌ మొహమ్మద్‌ అల్‌ జాదాన్‌ చెప్పారు. సౌదీ సిటిజన్స్‌ తమ సొంత ఇంటిని సమకూర్చుకుంటే 1 మిలియన్‌ రియాల్స్‌ వరకూ ట్యాక్స్‌ని ప్రభుత్వం భరిస్తుందని రాయల్‌ ఆర్డర్‌ పేర్కొంది. కాగా, సౌదీ అరేబియా వచ్చే ఏడాది బడ్జెట్‌లో 7.5 శాతం కేటాయింపుల్ని తగ్గించడం జరిగింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com