భారత్లో లక్ష దాటిన కరోనా మరణాలు..
- October 03, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా దారుణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆ దరిద్రపు క్రిమి... జనం ప్రాణాలు తీసేస్తోంది. తాజాగా నిన్న కొత్తగా 79476 మందికి కరోనా సోకింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64,73,544కి చేరింది. అలాగే... నిన్న 1069 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,00,846కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.6 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది కాస్త తగ్గి.. 2.97 శాతంగా ఉంది.
భారత్ లో నిన్న 75,628 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కరోనా రికవరీల సంఖ్య 54,27,706కి చేరింది. దేశంలో రికవరీ రేటు మరింత పెరిగి 83.8 శాతానికి చేరింది. దేశంలో యాక్టివ్ కేసులు ఇప్పుడు 9,44,996 ఉన్నాయి. ఇండియాలో నిన్న 11,32,675 టెస్టులు చేశారు. మొత్తం టెస్టుల సంఖ్య 7,78,50,403కి పెరిగింది.
ప్రస్తుతం మొత్తం కేసుల్లో అమెరికా తర్వాత భారత్ టాప్ 2లో కొనసాగుతోంది. రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇండియా మొదటి స్థానంలో కొనసాగుతోంది. అలాగే... మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్... మూడో స్థానంలో ఉంది. రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో ఇండియా మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అమెరికా, బ్రెజిల్ ఉన్నాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!