మస్కట్: గవర్నరేట్ పరిధిలో బస్సు సర్వీసుల పునరుద్ధరణ

- October 03, 2020 , by Maagulf
మస్కట్: గవర్నరేట్ పరిధిలో బస్సు సర్వీసుల పునరుద్ధరణ

మస్కట్: కరోనా నేపథ్యంలో మస్కట్ గవర్నరేట్ పరిధిలో ఇన్నాళ్లు రద్దైన బస్సు సర్వీసులు ఎట్టకేలకు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. ఆదివారం(ఆక్టోబర్ 4) నుంచి తమ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ఎంవసలాత్ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. " ప్రియమైన వినియోదారుల్లారా...మస్కట్ గవర్నరేట్ పరిధిలో సిటీ బస్సు సర్వీసులను ఆక్టోబర్ 4 నుంచి తిరిగి ప్రారంభించబోతున్నాం" అంటూ తమ ప్రకటనలో తెలిపింది. అయితే..చిన్నపిల్లలు, 60 ఏళ్లు దాటిన వారిని ప్రయాణానికి అనుమతిస్తారా? లేదా? అనేది మాత్రం తమ ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com