బహ్రెయిన్ లో భారీగా తగ్గుతున్న విదేశీ కార్మికుల సంఖ్య
- October 03, 2020
బహ్రెయిన్: స్థానికులకు ఉపాధి అవకాశాలను పెంచాలన్న విధాన పరమైన నిర్ణయాలతో బహ్రెయిన్ లో విదేశీ కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. పలు కంపెనీలు, పబ్లిక్ సెక్టార్ లలోని ఉద్యోగాలను స్థానికులతోనే భర్తీ చేస్తుండటం ప్రవాసీయులపై ప్రభావం చూపిస్తోంది. దీంతో వాళ్లంతా బహ్రెయిన్ విడిచి వెళ్లిపోతున్నారు. గతేడాది కింగ్డమ్ పరిధిలో 4,77,741 మంది విదేశీ కార్మికులు ఉంటే ఈ ఏడాది ఆ సంఖ్య 4,56,840కి తగ్గినట్లు బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో బహ్రెయినీ ఉద్యోగుల సంఖ్య 1,44, 511కి పెరిగింది. ఇందులో 47,544 మంది పబ్లిక్ సెక్టార్ లో 96,967 మంది ప్రైవేట్ సెక్టార్ లో విధులు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉంటే నెలవారి జీతాల విషయంలోనూ బహ్రెయిన్ పౌరులకు, విదేశీ కార్మికులకు మధ్య భారీ వ్యత్యాసం ఉంటున్న విషయం తెలిసిందే. బహ్రెయిన్ పౌరులకు నెల జీతం సగటున 913 దిర్హామ్ లు గా ఉంటే..దాదాపు 3,30,000 మంది కార్మికుల నెల జీతం 200 దిర్హామ్ లుగా ఉంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!