క్రమంగా తగ్గుతున్న కోవిడ్ తీవ్రత..అక్టోబర్ 3న 175 కేసులు నమోదు
- October 03, 2020
ఖతార్ పరిధిలో కోవిడ్ తీవ్రత కొద్ది రోజులుగా క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో కింగ్డమ్ పరిధిలో కొత్తగా 175 కరోనా కేసులు నమోదవగా, 194 మంది కోలుకున్నట్లు ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 1,26,339 మంది కరోనా బారిన పడితే..అందులో 1,23,302 మంది రికవరీ అయ్యారు. కొత్తగా నమోదైన 175 మందిలో 155 కమ్యూనిటీ కేసులు ఉండగా..20 మంది విదేశాల నుంచి తిరిగివచ్చిన వారు ఉన్నట్లు అధికారులు వివరించారు. మరోవైపు గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 83 ఏళ్ల వ్యక్తి చనిపోయినట్లు ప్రకటించారు. దీంతో ఖతార్ లో కోవిడ్ మృతుల సంఖ్య 216కి చేరింది. ఇదిలాఉంటే..గడిచిన 24 గంటల్లో 5,200 మందికి కరోనా టెస్టులు నిర్వహించామని, ఇప్పటివరకు 7,91,424 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..