బహ్రెయిన్: మస్కట్ కు విమాన సర్వీసులను పునరుద్ధరించిన గల్ఫ్ ఎయిర్
- October 03, 2020
బహ్రెయిన్ కు చెందిన గల్ఫ్ ఎయిర్ ఎట్టకేలకు ఒమన్ రాజధాని మస్కట్ కు విమాన సర్వీసులను పునరుద్ధరించింది. ఆదివారం (ఆక్టోబర్ 4) నుంచి మస్కట్ కు బహ్రెయిన్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఆపరేట్ చేస్తున్నట్లు గల్ఫ్ ఎయిర్ ప్రతినిధులు ప్రకటించారు. దీంతో మస్కట్ వెళ్లాలనుకునే వారికి కొంత వెసులుబాటు దక్కినట్లైంది. ఇన్నాళ్లు బహ్రెయిన్ నుంచి మస్కట్ వెళ్లాలనుకునే ప్రయాణికులు ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి మళ్లీ మస్కట్ కు వెళ్లాల్సి వచ్చేది. ఇక ఇప్పుడు గల్ఫ్ ఎయిర్ తమ సర్వీసులను పునరుద్ధరించటంతో నేరుగా మస్కట్ చేరుకోవచ్చు. ఇదిలాఉంటే...ప్రపంచంలోని పలు దేశాలకు విమాన సర్వీసులు నడుపుతున్న గల్ఫ్ ఎయిర్ కు గల్ఫ్ దేశాల్లో మాత్రం మస్కట్ ప్రధాన వనరుగా ఉంటూ వస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







