తెలంగాణ లో కొత్తగా 1949 కరోనా కేసులు
- October 04, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1949 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య ఒక లక్షా 99 వేలు దాటిందని.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. శనివారం ఇక్క రోజులో కరోనాతో 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 11 వందల 63కి చేరింది. కరోనా నుంచి కోలుకుని శనివారం ఒక్క రోజులో 2 వేల 366 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో లక్షా 70 వేల 212 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 27 వేల 901 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో కొత్తగా 291 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లాలో 156, మేడ్చల్‌లో 150 కొత్త కేసులు నమోదయ్యాయి.. నల్గొండలో 124, కరీంనగర్‌లో 114 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







