కీటో డైట్ వికటించి బాలీవుడ్ నటి మృతి
- October 04, 2020
బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ఐటెం సాంగ్స్‌తో బాగా పాపులర్ అయిన మిష్టీ ముఖర్జీ(27) కన్నుమూశారు. కీటో డైట్ చేస్తున్న ఈ నటికి కిడ్నీ సమస్యలు తలెత్తాయి. దీంతో గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆమె మృతిపట్ల బాలీవుడ్ చిత్రపరిశ్రమ సంతాపం తెలుపుతుంది. ఇక ఆమె సినీ కెరీర్ విషయానికి వచ్చేసరికి 2012లో వచ్చిన "లైఫ్ కి తో లగ్ గయి" అనే సినిమాతో ఆమె సినీ కెరియర్ మొదలైంది.
రజనీష్ దుగ్గల్ తో కలిసి గోవింద ఆలే రే అనే డ్యాన్స్ నెంబర్ చేసింది. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ మరియు కత్రినా కైఫ్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వగా, జూహి చావ్లా ప్రధాన పాత్రలో నటించారు. మ్యూజిక్ వీడియోలతో ఆమె మరింతగా పాపులర్ అయ్యారు! ఇక ముంబైలోని ఆమె అద్దె అపార్ట్మెంట్లో సెక్స్ రాకెట్ నడిపారనే ఆరోపణలు రావడంతో 2014 లో నటి సోదరుడు, తండ్రిని అరెస్టు చేశారు. మిష్టీ ముఖర్జీ హిందీతోపాటు బెంగాలీ సినిమాలలో కూడా నటించారు. 27 ఏళ్ల వయసున్న మిస్తీ బెంగళూరులో స్థిరపడ్డారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!