దుబాయ్ లో ప్రపంచపు అతిపెద్ద ఫౌంటెన్..గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టనుందా!!

- October 04, 2020 , by Maagulf
దుబాయ్ లో ప్రపంచపు అతిపెద్ద ఫౌంటెన్..గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టనుందా!!

దుబాయ్: అనుక్షణం ఎదో ఒక కొత్త ఆకర్షణలతో రికార్డులు కొడుతూ ప్రపంచాన్ని ఆకట్టుకుంటుంది దుబాయ్. బుర్జ్ ఖలీఫా, అట్లాంటిస్, ది వరల్డ్..ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ కు అంతు ఉండదు. ఇక బుర్జ్ ఖలీఫా పాదాలవద్ద అలరించే ఫౌంటెన్ సొగసుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది..ఇప్పుడు దీనిని తలదన్నే ఇంకో ఫౌంటెన్ కి శ్రీకారం చుట్టారు అట్లాంటిస్ యాజమాన్యం. అదే  'ది పామ్ ఫౌంటైన్స్'.

అక్టోబర్ 22 న  పామ్ జుమైరా లో నఖీల్ తన సరికొత్త ఆకర్షణ 'ది పామ్ ఫౌంటైన్స్' ను ప్రదర్శించనుంది. అతిపెద్ద ఫౌంటెన్‌గా నిలిచి గిన్నిస్ రికార్డ్‌ను బద్దలు కొట్టాలని లక్ష్యంగా ఈ డ్యాన్స్ ఫౌంటెన్ షోను రూపొందిస్తున్నారు నఖీల్.

ఆకట్టుకునే ఈ ఫౌంటైన్లు 105 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడతాయి. 3,000 కి పైగా ఎల్ఈడి లైట్లతో పాటు కొరియోగ్రాఫ్ చేయబడ్డాయి. ప్రతిరోజూ మూడు నిమిషాల వ్యవధి తో కూడిన  20 షోలను ఐదు వేర్వేరు థీమ్ తో ప్రదర్శించనున్నారు. ఈ షోలు సాయంత్రం 7 నుండి అర్ధరాత్రి వరకు ప్రతి 30 నిమిషాలకు వేస్తారు. వీటికి ప్రవేశం పూర్తిగా ఉచితం.

అక్టోబర్ 22 న ప్రారంభమయ్యే ఈ ఈవెంట్ కు అందరు ఆహ్వానితులే..సాయంత్రం 4 గంటల నుండి DJ సెట్లు, డ్యాన్స్ షోలు, బాణసంచా ప్రదర్శనతో సహా ప్రత్యక్ష వినోదం ఉంటుంది. వచ్చిన మొదటి 5,000 మంది వినియోగదారులకు ఉచిత ఎల్‌ఈడీ రిస్ట్‌బ్యాండ్ లభిస్తుంది. సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయవలసిందిగా అధికారులు తెలిపారు.

వీక్షించదలచినవారు ప్లాటినం జాబితా ద్వారా ఉచిత ఈవెంట్ కోసం నమోదు చేసుకోవచ్చు. అంతేకాకుండా రాత్రి 8 నుండి ప్రారంభమయ్యే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ ప్రయత్నాన్ని కూడా చూడవచ్చు.

పామ్ ఫౌంటైన్స్, ది పాయింట్, పామ్ జుమైరా, అక్టోబర్ 22, సాయంత్రం 4 నుండి 12 వరకు. ప్రవేశం ఉచితం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com