మొదలైన ఉమ్రా...ముఖ్యమైన ముందు జాగ్రత్త చర్యలు

- October 04, 2020 , by Maagulf
మొదలైన ఉమ్రా...ముఖ్యమైన ముందు జాగ్రత్త చర్యలు

సౌదీ: కరోనా నేపథ్యంలో ఏడు నెలల తరువాత విస్తృతమైన ఆరోగ్య జాగ్రత్తల మధ్య అధికారులు పాక్షికంగా ఉమ్రాను తిరిగి ప్రారంభించడంతో వేలాది మంది యాత్రికులు మక్కాలోని హరామ్‌ కు చేరుకున్నారు.

దశల వారీగా..

ఉమ్రా యొక్క పునః ప్రారంభం మూడు దశల్లో పునరుద్ధరించబడింది. మొదటి దశలో రోజుకు 6,000 మంది యాత్రికులను ఉమ్రా నిర్వహించడానికి అనుమతిస్తామని హజ్ మంత్రి మొహమ్మద్ బెంటెన్ చెప్పారు. 

అయితే, ఈ మొదటి దశ పునః ప్రారంభం సమయంలో సౌదీ పౌరులు మరియు నివాసితులు మాత్రమే హరామ్‌లోకి ప్రవేశించడానికి అనుమతించబడతారు. ప్రతి యాత్రికుడికి ఉమ్రాను పూర్తి చేయడానికి మూడు గంటల సమయం ఇవ్వబడుతుంది. ప్రతి 20 లేదా 25 మంది యాత్రికుల బృందానికి ఒక ఆరోగ్య కార్యకర్త ఉంటారని, అత్యవసర పరిస్థితుల్లో వైద్య బృందాలు మైదానంలో ఉంటాయని బెంటెన్ తెలిపారు.

అక్టోబర్ 18 నుండి రెండవ దశ ప్రారంభమవుతుంది. ఇందులో ఉమ్రా యాత్రికుల సంఖ్య రోజుకు 15,000 కు పెంచబడుతుంది. యాత్రికులు మరియు ఇతర ఆరాధకులతో సహా గరిష్టంగా 40,000 మందికి హరామ్ వద్ద ప్రార్థనలు చేయడానికి అనుమతి ఇవ్వబడుతుంది.

ఇక నవంబర్ 1 నుండి ప్రారంభం కానున్న మూడవ దశలో అంతర్జాతీయ యాత్రికులకు  అనుమతి ఇవ్వబడుతుంది. ఇందులో యాత్రికుల సంఖ్య 20,000 మరియు 60,000 కు పెంచబడుతుంది అని వివరించారు బెంటెన్.

చేపడుతున్న ముందు జాగ్రత్త చర్యలు:
  ఉమ్రా కొరకు ప్రతిరోజూ 10 సార్లు గ్రాండ్ మసీదును కడగడం జారుతుంది. యాత్రికులు ఉమ్రా ఆచారాలు చేయడం పూర్తయిన తర్వాత, 4000 మంది కార్మికులు వాషింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. ఇందుకుగాను 60,000 లీటర్ల డిటర్జెంట్లు మరియు క్రిమిసంహారక మందులను ప్రతిరోజూ ఉపయోగిస్తారు అని గ్రాండ్ మసీదు మరియు ప్రవక్త యొక్క మసీదు వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com