ఏపీలో కొత్తగా 6,242 కరోనా కేసులు..
- October 04, 2020
అమరావతి:ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 72,811 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 6,242 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 7,06,790కి చేరింది.
కొవిడ్ వల్ల కృష్ణలో ఆరుగురు, అనంతపూర్‌లో ఐదుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, నెల్లూరులో నలుగురు, ప్రకాశంలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఇద్దరు, కర్నూల్‌లో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున 40 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 5,981కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 6,58,875 మంది కోలుకుని, డిశ్చార్జి కాగా.. 54,400 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







