పనిలోపని న్యూ ఇయర్ వేడుకలు కూడా అక్కడే ప్లాన్ చేసేస్తున్నాడు మహేష్ బాబు
- October 05, 2020
కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన చిత్ర పరిశ్రమ.. కేంద్రం షూటింగ్‌లకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు... థియేటర్లకు సైతం అనుమతినివ్వడంతో శరవేగంగా షూటింగ్‌లు జరుపుకుంటోంది. ఒకటి అర సినిమాలు తప్ప దాదాపు అన్ని సినిమాలూ షూటింగ్‌ను ప్రారంభించుకుంటున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రం కూడా సిద్ధమవుతోంది. పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కోసం చిత్రబృందమంతా అమెరికా వెళ్లనుంది.
ఈ షెడ్యూల్ 45 రోజల పాటు కొనసాగనుంది. మహేష్‌తో పాటు ప్రధాన తారాగణమంతా అమెరికాకు వెళ్లనుంది. అమెరికాలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను దర్శకుడు పరుశురాం తెరకెక్కించనున్నారు. బ్యాంకింగ్ రంగంలో మోసాలు, కుట్రల నేపథ్యంలో ఈ చిత్రాన్ని పరుశురామ్ రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. అమెరికాలో 45 రోజుల షూటింగ్ నిర్వహించిన అనంతరం ‘సర్కారు వారి పాట’ చిత్ర యూనిట్ మళ్లీ జనవరిలో ఇండియాకి తిరిగొస్తారని తెలుస్తోంది. చిత్రబృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ను నిర్మిస్తున్నాయి. అయితే తొలుత ఈ చిత్రానికి పీఎస్ వినోద్‌ను ఛాయాగ్రాహకుడిగా తీసుకున్నారు. ఆయన ‘వకీల్ సాబ్’ చిత్రీకరణ పూర్తి చేయాల్సి ఉండటంతో డేట్స్ అడ్జస్ట్ చేయడం కుదరడం లేదని సమాచారం. దీంతో మరో ఛాయాగ్రాహకుడు మదిని తీసుకున్నారని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది విజయదశమికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!