CRIC QATAR ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్ 6 ఆల్ రౌండర్స్ క్రికెట్ క్లబ్ గెలుచు కుంది

- October 05, 2020 , by Maagulf
CRIC QATAR ఛాంపియన్స్ ట్రోఫీ సీజన్ 6 ఆల్ రౌండర్స్ క్రికెట్ క్లబ్ గెలుచు కుంది

దోహా:దోహా లో క్రిక్ ఖతార్ ఛాంపియన్స్ లీగ్ సీజన్ 6 లో 48 జట్లు  పాల్గొన్నాయి.మ్యాచ్‌లు లీగ్ ఫార్మాట్ లో జరిగాయి. జట్లను 8 గ్రూపులుగా విభజించారు.ప్రతి గ్రూపులో 6 జట్లు ఉన్నాయి మరియు వారు 5 లీగ్ మ్యాచ్‌లు ఆడారు.తరువాత నాకౌట్‌లు జరిగాయి.  

 ఫైనల్స్ JSC జట్టు మరియు ఆల్ రౌండర్స్ జట్ల మధ్య జరిగాయి.టాస్ జెఎస్‌సి జట్టు గెలుచుకుంది, JSC మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు మరియు 15 ఓవర్లలో 167/7  పరుగులు సాధించారు. మరియు జెఎస్సి జట్టుకు టాప్ స్కోరర్లు ఫర్హాన్ షౌకత్ 42/31 ఆరు బౌండరీలతో, ఫౌజాన్ హైదర్ 39/14 రెండు బౌండరీలు మరియు 4 సిక్సర్లతో సాధించారు.

లక్ష్యాన్ని ఆల్ రౌండర్స్ జట్టు 14.3 ఓవర్లలో 171/7 పరుగులు చేసి ఛేదించింది. ఆల్ రౌండర్స్ జట్టులో టాప్ స్కోరర్లు పర్వేజ్ బావా 46/16 నాలుగు బౌండరీలు, మరియు 4 భారీ సిక్సర్లతో చేసారు,  సలీం బాబు 35/20 రెండు  బౌండరీలు, 3 సిక్సర్లతో చేసారు. పర్వేజ్ బావా ని మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శన కోసం  మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రకటించారు. 

బౌలింగ్‌లో జెఎస్సి నుండి జుహెబ్ జాహిద్ మరియు సల్మాన్ షాబందర్  3 వికెట్లు, ఆల్ రౌండర్స్  నుండి ముహమ్మద్ రిజ్వాన్ 3 వికెట్లు పడగొట్టారు.

 ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి డానా వరల్డ్ కాంట్రాక్టింగ్ కంపెనీకి చెందిన గడ్డే శ్రీనివాస్ ప్రసంగించారు. క్రిక్ ఖతార్  టోర్నమెంట్లో  ముఖ్య అతిథిగా పాల్గొనడం గర్వంగా ఉందని అన్నారు, మరియు క్రిక్ ఖతార్ వ్యవస్థాపకుడు సయ్యద్ రఫీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఇ టువంటి అద్భుతమైన టోర్నమెంట్లను ప్రొఫెషనల్ పద్ధతిలో నిర్వహించడం గర్వించ దగ్గ విషయం అని చెప్పారు.విజేతలు మరియు రన్నరప్‌లకు ట్రోఫీలు అందించారు.

క్రిక్ ఖతార్ వ్యవస్థాపకుడు మరియు ఛైర్మన్ సయ్యద్ రఫీ మాట్లాడుతూ మొత్తం 48 జట్లకు ధన్యవాదాలు తెలిపారు, రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద టోర్నమెంట్‌లతో రాబోతున్నామని తెలిపారు. స్పాన్సర్స్ హెచ్‌పి ఇండస్ట్రీస్, స్నో కింగ్ మరియు డానా వరల్డ్ కాంట్రాక్టింగ్ సంస్థ కి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com