విశాఖ స్మార్ట్‌సిటీ ప్రణాళికకు అమెరికా సహకారం
- February 12, 2016
విశాఖ ఆకర్షణీయ నగర బృహత్ ప్రణాళిక తయారీకి సహకారం అందిస్తున్నట్లు భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తెలిపారు. స్మార్ట్‌సిటీ కోసం విశాఖకు రూ.10కోట్లు కేటాయించినట్లు చెప్పారు. భారత్అమెరికా మధ్య సంబంధాల్లో గతేడాది కీలక ముందడుగు పడిందని... ఈ బంధం ఈ ఏడాది మరింత బలోపేతం చేస్తామన్నారు. రక్షణ రంగంలో సహకారానికి మరింత ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో భారత్అమెరికా మధ్య వాణిజ్యాన్ని విస్తృతం చేయనున్నట్లు వర్మ చెప్పారు.ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. లక్ష్యానికి అనుగుణంగా రెండు దేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయన్నారు. అమెరికా ఎగుమతి, దిగుమతుల్లో భారత్ వాటా కేవలం 2 శాతం మాత్రమే ఉందని... విస్తరణకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. భారత విద్యార్థులను అమెరికాలో ఉద్దేశపూర్వకంగా అవమానించలేదని... ప్రవేశాల్లో రెండంచెల విధానం గుర్తించలేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారని వర్మ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







