యూఏఈ:ముంచుకొస్తున్న వీసా రెన్యూవల్ డెడ్ లైన్..ఆక్టోబర్ 11 తర్వాత ఫైన్

- October 06, 2020 , by Maagulf
యూఏఈ:ముంచుకొస్తున్న వీసా రెన్యూవల్ డెడ్ లైన్..ఆక్టోబర్ 11 తర్వాత ఫైన్

యూఏఈ:మార్చి 1 నుంచి జులై 11 మధ్య వీసా గడువు ముగిసిన ప్రవాసీయులు, పర్యాటకులు అందరూ ఆక్టోబర్ 11 నాటికల్లా వీసాలను రెన్యూవల్ చేసుకోవాలని యూఏఈ గుర్తు చేసింది. లేదంటే ఆక్టోబర్ 12 నుంచి ఓవర్ స్టేయింగ్ జరిమానా ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. అలాగే ప్రవాసీయులు తమ నివాస అనుమతులను కూడా రెన్యూవల్ చేసుకోవాలని సూచించింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో మార్చి 1 నుంచి జులై 11 మధ్య వీసా గడువు ముగిసిన జీసీసీ పాస్ పోర్టుదారులకు, యూఏఈ ప్రవాసీయులకు మూడు నెలల సమయం పొడిగించింది. ఆ గడువు అక్టోబర్ 11తో ముగియనుంది. అయితే డెడ్ లైన్ కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంటడంతో ప్రవాసీయులు, పర్యాటకులు త్వరగా వీసా రెన్యూవల్ చేసుకోవాలని యూఏఈ సూచించింది. లేదంటే ఆక్టోబర్ 12 నుంచి రోజుకు 25 దిర్హామ్ ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దేశం విడిచి వెళ్లే సమయంలో అదనంగా 250 దిర్హామ్ లు చెల్లించాలి. ఇక ఎమిరాతి గుర్తింపు కార్డును రెన్యూవల్ చేసుకోకుంటే రోజుకు రోజుకు 20 దిర్హామ్ ల జరిమానా విధిస్తామని హెచ్చరించింది. తీవ్రతను బట్టి ఈ జరిమానా 1000 దిర్హామ్ ల వరకు ఉంటుందని తెలిపింది. వీసా గడువుకు సంబంధించి ఎవరికైనా సందేహాలు ఉంటే...పౌర గుర్తింపు అధికార సమాఖ్య అధికార పోర్టల్ http://www.ica.gov.ae. ద్వారా చెక్ చేసుకోవాలని సూచించింది. ఇక దుబాయ్ పరిధిలో ఉండే ప్రవాసీయులు....విదేశీ వ్యవహారాలు, ప్రవాసీయుల జనరల్ డైరెక్టరేట్ కు చెందిన వెబ్ సైట్ లో వీసా గడువు చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా డొమస్టిక్ వర్కర్స్, స్పాన్సర్లపై ఆధారపడిన వారు తమ వీసా గడువును వెబ్ సైట్ల ద్వారా చెక్ చేసుకోవటం మంచిదని యూఏఈ సూచించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com