అటల్ టన్నెల్‌లో యాక్సిడెంట్లు..రేసింగ్లు, సెల్ఫీలే కారణం..
- October 06, 2020
న్యూఢిల్లీ: అటల్ టన్నెల్ ప్రారంభించిన 72 గంటల్లో పలు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.లే-మనాలీ మధ్య 46 కి.మీ మధ్య దూరాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన అటల్ టన్నెల్ ను ఈ నెల 3వ తేదీన ప్రారంభించారు.
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కొత్త టూరిస్ట్ ప్రాంతంగా ఈ టన్నెల్ మారింది. ఈ టన్నెల్ ప్రారంభమైన మూడు రోజుల్లో మూడు ప్రమాదాలు నెలకొందని ఓ వార్తా పత్రిక తెలిపింది.
బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బిఆర్ఓ) జిల్లా అధికారులు ఈ టన్నెల్ కారణంగా కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. వందలాది మంది పర్యాటకులు , వాహనదారులు ఈ సొరంగమార్గంలో రేసింగ్ తో కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారని నివేదికలు చెబుతున్నాయి.ఈ సొరంగ మార్గం ప్రారంభించిన అక్టోబర్ మూడో తేదీన ఒక్కరోజే మూడు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి.
ఈ సొరంగమార్గంలో ప్రయాణం చేసే సమయంలో పర్యాటకులు, వాహనదారులు ట్రాపిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెల్పీలు తీసుకొంటున్నారని బీఆర్ఓ చీఫ్ ఇంజనీర్ కేపీపురుషోత్తమన్ చెప్పారు.ఈ టన్నెల్ లో వాహనాలను నిలిపేందుకు ఏ ఒక్కరికి కూడ అనుమతి లేదని అధికారులు తెలిపారు.
టన్నెల్ లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీసులను నియమించాలని బీఆర్ఓ అధికారులు కోరారు. అటల్ సొరంగంలో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, అతి వేగంగా వాహనాలను నడపడకుండా చర్యలు తీసుకొన్నామని ఎస్పీ గౌరవ్ సింగ్ చెప్పారు.
ఈ టన్నెల్ లో ఉదయం 9 నుండి 10 గంటలు, సాయంత్రం నాలుగు నుండి ఐదు గంటల వరకు ప్రజలకు అనుమతిని నిరాకరిస్తున్నారు.సొరంగమార్గంలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర గిరిజన శాఖ మంత్రి డాక్టర్ రామ్ లాల్ మర్కండా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!