ముందస్తు అనుమతి లేకుండా ఈ విమానాశ్రయం చేరుకోవచ్చు
- October 06, 2020
రస్ అల్ ఖైమా: డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, రస్ అల్ ఖైమా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా అక్టోబర్ 15 నుంచి రెసిడెంట్స్ దేశంలోకి ముందస్తు అనుమతి లేకుండా రావొచ్చని పేర్కొంది. అక్టోబర్ 15 నుంచి కొత్త ట్రావెల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. కాగా, కోవిడ్19 టెస్ట్ (ఫలితం నెగెటివ్ అయి వుండాలి) 96 గంటలకు ముందుగా తీసుకుని రావాల్సి వుంది. ట్రావెలర్స్ లేదా స్పాన్సరర్స్ మరో లేబ్ టెస్ట్ లేదా పిసిఆర్ టెస్ట్‌కి సంబంధించిన ఖర్చు భరించాల్సి వుంటుంది. టూరిస్ట్ మెడికల్ ఇన్స్యూరెన్స్ వుండి, ట్రావెల్ టికెట్‌ని పొంది వుండి అలాగే తగిన ట్రావెల్ రిక్వైర్మెంట్స్ వుంటే టూరిస్టులకు కూడా ఈ అవకాశం కల్పిస్తారు. వీరికి కూడా పిసిఆర్ టెస్ట్ తప్పనిసరి. ఆయా దేశాలకు సంబంధించిన నియమ నిబంధనలకు అనుగుణంగా రస్ అల్ ఖైమా నుంచి ఎవరైనా ఏ దేశానికి అయినా వెళ్ళడానికి వీలు కలిపిస్తున్నారు.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..