ఆర్థిక నేరాల కోసం కొత్త ప్రాసిక్యూషన్ ఆఫీస్
- October 06, 2020
మనామా: బహ్రెయిన్, ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసుల్ని డీల్ చేయడం కోసం కొత్త ప్రాసిక్యూషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. మనీ లాండరింగ్ తదితర నేరాలకు సంబంధించిన కేసుల్ని ఇక్క డడీల్ చేస్తారు. బహ్రెయిన్ అటార్నీ జనరల్ అలీ ఫదల్ అల్ బుయైనైన్ ఈ విషయాన్ని వెల్లడించారు. రాయల్ ఆర్డర్ నేపథ్యంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ వంటివాటిని ఈ కొత్త ప్రాసిక్యూషన్ ఆఫీస్ ద్వారానే నియంత్రించడానికి చర్యలు తీసుకుంటారు. పబ్లిక్ అడ్వొకేట్ అలాగే ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూషన్ మెంబర్స్ ఈ కార్యాలయంలో వుంటారు. పీనల్ కోడ్, స్పెషల్ క్రిమినల్ చట్టాలు, ఫైనాన్షియల్ మరియు సూపర్వైజరీ లెజిఏ్లషన్ వంటివాటిల్లో స్పెషలైజేషన్ విభాగం కింద ఈ కార్యాలయం విధులు నిర్వర్తిస్తుంది. ఆర్థిక నేరాలకు సంబంధించి ఎలక్ట్రానిక్ డేటాబేస్ పూర్తిస్థాయిలో వుండేలా ఈ కార్యాలయంలో చర్యలు చేపడతారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







