వర్చువల్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం

- October 06, 2020 , by Maagulf
వర్చువల్ ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్న ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం

న్యూ ఢిల్లీ:GMR ఆధ్వర్యంలోని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (DIAL) ఇటీవల ఢిల్లీ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రయాణికుల కోసం ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ పోర్ట్ వర్చువల్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఈ ట్రావెల్‌టైన్మెంట్‌ను ప్రారంభించడం ద్వారా ప్రయాణీకులకు ఉత్తమమైన ప్రయాణానుభవాన్ని అందించాలని నిర్దేశించుకున్న లక్ష్యాన్ని DIAL కొనసాగిస్తుంది.

‘వర్చువల్ రియాలిటీ డోమ్’ అని పిలువబడే ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను హైదరాబాద్‌లో ఉండే ఒక కన్సెషనెయిర్ ద్వారా అభివృద్ధి చేశారు, ఇది ప్రపంచ ప్రయాణ మరియు పర్యాటక పరిశ్రమ కోసం 360-డిగ్రీ వర్చువల్ రియాలిటీ కంటెంట్‌ను అందిస్తుంది. ఈ వర్చువల్ రియాలిటీ సెటప్‌ను గత వారం ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 3 యొక్క డొమెస్టిక్ డిపార్చర్ వద్ద ప్రారంభించారు. గేట్ 41 సమీపంలో ఉన్న ఈ మినీ ప్లానిటోరియం, అర్ధ వృత్తాకార నిర్మాణాన్ని, వంపు తిరిగిన స్క్రీన్ కలిగి ఉంది. ఇది ప్రయాణీకులకు మొదటి నుంచి చివరి వరకు ప్రయాణ అనుభవాలలో లీనమయ్యేలా లైఫ్ సైజ్ సినిమా లాంటి వేదికను అందిస్తుంది. దీనిలో ప్రయాణికులు రోలర్-కోస్టర్, అర్బన్ ల్యాండ్‌స్కేప్, ఐస్-ఏజ్ వంటి వర్చువల్ రియాలిటీ కంటెంట్ నుండి దేనినైనా ఎంచుకోవచ్చు.

ఈ వర్చువల్ రియాలిటీ డోమ్ 24x7 తెరిచి ఉంటుంది. రోజులో ఏ సమయంలోనైనా 7 నిమిషాల నుండి 15 నిమిషాల వరకు వర్చువల్ రియాలిటీ షోలను అన్ని వయసుల ప్రయాణీకులు ఆస్వాదించే విధంగా దీనిని రూపొందించారు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో, 5 మీటర్ల వ్యాసం కలిగిన ఈ డోమ్‌లో, ఒకేసారి ఎనిమిది మంది మాత్రమే సామాజిక దూరాన్ని పాటిస్తూ కూర్చోవచ్చు. కాలుష్య వ్యాప్తిని అరికట్టటానికి, పరిశుభ్రతను పాటించటానికి ప్రయాణీకులు తమ బూట్లతో  ఈ డోమ్ లోనికి ప్రవేశించాలి.

ప్రయాణికులు డోమ్ నుండి బయటకు రాగానే, వైరస్ రహిత వాతావరణాన్ని అందించడానికి సీట్లను మళ్లీ శుభ్రపరుస్తారు. ప్రస్తుతం సగటున రోజుకు 80 మంది ఈ వర్చువల్ ప్రయాణ అనుభూతిని పొందుతున్నారు. ఈ వర్చువల్ సెటప్ ప్రారంభించడంపై శ్రీ విదేహ్ కుమార్ జైపురియార్, సీఈఓ-డిఐఎఎల్, ‘‘ఢిల్లీ విమానాశ్రయంలో ప్రపంచంలోని మొట్టమొదటి వర్చువల్ రియాలిటీ డోమ్ ప్రారంభించడం ద్వారా మేం మా ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉంటామని మరోసారి స్పష్టం చేస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ డిజిటల్ ట్రావెల్ వేదికను సురక్షితంగా చేయడానికి అవసరమైన అన్ని భద్రతా చర్యలను తీసుకోవడం జరిగింది. ” అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com