ప్రయాణీకులకు కరోనా చికిత్స ప్యాకెజీ ఉచితంగా అందిస్తున్న 'ఎయిర్ అరేబియా'

- October 06, 2020 , by Maagulf
ప్రయాణీకులకు కరోనా చికిత్స ప్యాకెజీ ఉచితంగా అందిస్తున్న \'ఎయిర్ అరేబియా\'

యూఏఈ: షార్జా మరియు అబుధాబి నుండి 'ఎయిర్ అరేబియా' లో ప్రయాణించే ప్రయాణికులందరికీ ఉచిత గ్లోబల్ కోవిడ్ -19 కవర్ను ప్రకటించింది ఎయిర్ అరేబియా. ఈ ఇన్సూరెన్స్ ప్రతి ప్రయాణీకుడికి తమ బుకింగ్ తో ఆటోమేటిక్ గా అందచేయబడుతుంది. దీనికి గాను ప్రయాణీకులు అదనపు పత్రాలు పొందుపరచాల్సిన అవసరం లేదు.

అయితే, ఈ కోవిడ్ ఇన్సూరెన్స్, ప్రయాణానికి బయలుదేరిన రోజు నుండి 31 రోజులు చెల్లుతుంది. ఇందులో వైద్య ఖర్చులు మరియు క్వారంటైన్ ఖర్చులను అందించనున్నారు.

ప్రయాణ సమయంలో కోవిడ్ -19 తో బాధపడుతున్న ప్రయాణీకులు ఇన్సూరెన్స్ పొందేందుకు 24/7 ఎయిర్ అరేబియా COVID-19 గ్లోబల్ అసిస్టెన్స్ కవర్ బృందాన్ని సంప్రదించవచ్చు అని ఎయిర్ అరేబియా గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అడెల్ అల్ అలీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com