మానవత బై ఫ్రెండ్స్-హైదరాబాద్ (ఎంబిఎఫ్)

- October 06, 2020 , by Maagulf
మానవత బై ఫ్రెండ్స్-హైదరాబాద్ (ఎంబిఎఫ్)

ఏ.పి:నిరుపేద మరియు ఫ్రంట్‌లైన్ వారియర్ లకు సేవ చేయడంలో మానవత బై ఫ్రెండ్స్-హైదరాబాద్ (ఎంబిఎఫ్)  బృందం తమదైన  ప్రయత్నాలను కొనసాగిస్తూ, 6th అక్టోబర్ న 1500 ఎన్ 95 ఫేస్ మాస్క్‌లు మరియు 300 ఫేస్ షీల్డ్స్‌ (3.09 లక్షల రూపాయల విలువైన) మానవత బై ఫ్రెండ్స్-హైదరాబాద్ (ఎంబిఎఫ్) బృందం ప్రతినిధులు కల్యాణ చక్రవర్తి కాoడూరి, ప్రభు మైదుకూరి, రవి వర్మ, హవిలా ప్రమోదిని, నాగ భరద్వాజ, తేజరావు, ప్రజల భద్రతను అందించే ఫ్రంట్ లైన్లలో విధుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ పోలీసు సిబ్బందికి సహాయం చేయడానికి మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్ పోలీసు హెడ్క్వార్టర్స్ లోని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎన్. శ్రీధర్ రావు కి అందజేశారు. ఫేస్ మాస్క్‌ మరియు ఫేస్ షీల్డ్ ధరించడం ద్వారా మనల్ని మనం రక్షించుకోగలమని పోలీసులకు చేస్తున్న సహాయ సహకారాలకు ఆయన మానవత బై ఫ్రెండ్స్ నకు కృతజ్ఞతలు తెలిపారు.

సమావేశం తరువాత ఆంధ్రప్రదేశ్ డిజిపి గౌతమ్ సావాంగ్ ను మానవత బై ఫ్రెండ్స్-హైదరాబాద్ ప్రతినిధులు కలసి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండింటిలోనూ నిరుపేదలకు సహాయం చేయడానికి లాక్డౌన్ కాలం నుండి మానవత బై ఫ్రెండ్స్ ద్వారా జరుగుతున్న వివిధ సేవా కార్యకలాపాల గురించి వివరించారు. మానవత బై ఫ్రెండ్స్ ద్వారా చేస్తున్న స్వచ్ఛంద కార్యకలాపాలను ఆంధ్రప్రదేశ్ డిజిపి ప్రశంసించారు. ప్రజలంతా ఫేస్ మాస్క్‌లు ధరించాలని మరియు సామాజిక దూరాన్ని కొనసాగించాలని  డిజిపి విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com