రవితేజ, శ్రుతి హాసన్ 'క్రాక్' చివరి షెడ్యూల్ ప్రారంభం
- October 07, 2020
మాస్ మహారాజా రవితేజ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం 'క్రాక్'. ఇదివరకు ఆ ఇద్దరి కలయికలో వచ్చిన 'డాన్ శీను', 'బలుపు' సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి హిట్టయ్యాయి. ఇప్పుడు వారు హ్యాట్రిక్‌పై కన్నేశారు.
'క్రాక్' షూటింగ్ బుధవారం రామోజీ ఫిల్మ్ సిటీలో పునఃప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది.
ఇప్పటి నుండీ ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ రెగ్యులర్‌గా ఇచ్చేందుకు చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. త్వరలో పాటలు, ట్రైలర్ ఒక దాని తర్వాత ఒకటిగా విడుదల కానున్నాయి.
ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, మాస్ ఎలిమెంట్స్‌తో కనిపించిన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ రావడమే కాకుండా, రవితేజ ఫ్యాన్స్‌ను, ప్రేక్షకులను అవి అమితంగా ఆకట్టుకున్నాయి.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనే అంశాలతో, ఉద్వేగభరితమైన కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా తయారవుతున్న 'క్రాక్' మూవీలో శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్నారు. పేరుపొందిన తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్ పవర్‌ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు.
సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. 'మెర్సాల్', 'బిగిల్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం:
రవితేజ, శ్రుతి హాసన్, సముద్రకని, వరలక్ష్మీ శరత్‌కుమార్, దేవీ ప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కొమాకుల, వంశీ చాగంటి.
సాంకేతిక బృందం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీచంద్ మలినేని
నిర్మాత: బి. మధు
బ్యానర్: సరస్వతి ఫిలిమ్స్ డివిజన్
సంగీతం: ఎస్. తమన్
సినిమాటోగ్రఫీ: జి.కె. విష్ణు
డైలాగ్స్: సాయిమాధవ్ బుర్రా
సహ నిర్మాత: అమ్మిరాజు కానుమిల్లి
కూర్పు: నవీన్ నూలి
ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
పాటలు: రామజోగయ్య శాస్త్రి
పీఆర్వో: వంశీ-శేఖర్
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!