కరోనా కాలంలో కంపెనీ లాభాలు.. ఉద్యోగులకు కార్లు గిప్ట్
- October 07, 2020
కరోనా వైరస్ వచ్చి చాలా కంపెనీలను మూత పడేలా చేసింది. మరి కొన్ని కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించింది. ఈ పరిస్తితుల్లో ఓ కంపెనీ లాభాల బాట పట్టిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అందుకు ప్రతిగా ఉద్యోగులకు కంపెనీ కార్లు బహుకరించి ఉద్యోగుల పట్ల కంపెనీకి ఉన్న నిబద్ధతను తెలియజేసింది. అది కూడా కరోనా వైరస్‌ను ప్రపంచం మీదకు వదిలినట్టుగా చెప్పుకుంటున్న చైనాలో జరిగింది. జియాంగ్జీ వెస్ట్ దజియై ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్ తమ ఉద్యోగులకు 4,116 కార్లను బహుమతిగా ఇచ్చింది.
ఈనెల 1న ఈ కార్యక్రమాన్ని భాతీగా నిర్వహించింది. వరుసగా ఐదో ఏడాది కూడా కంపెనీ లాభాల బాట పట్టిందన్న సంతోషంతో యాజమాన్యం తమ సిబ్బందికి మరిచిపోలేని గిప్ట్‌ని అందించి ఉద్యోగుల పట్ల తనకున్న కృతజ్ఞతను చాటుకుంది. అయితే అవేవో సాదా సీదా కార్లు కాదు.. కాస్లీ కార్లు.. ఈ మొత్తం కార్లు కొనుగోలు చేయడానికి కంపెనీ ఖర్చు పెట్టి అక్షరాల రూ.540 కోట్లు. 1,183 ఖరీదైన FAW వోక్స్‌వ్యాగన్ మాగోటన్ కార్లు, 2,933 జియాంగ్లింగ్ ఫోర్డ్ టెరిటరీ కార్లను అందించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్‌గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్‌కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







