అజ్మన్:మనీ ఎక్సేంజ్ సిబ్బంది నుంచి డబ్బు చోరీ..24 గంటల్లో దొంగల అరెస్ట్
- October 07, 2020
అజ్మన్:ఓ మనీ ఎక్సేంజ్ సిబ్బందిని బెదిరించి వారి నుంచి 32 లక్షల దిర్హామ్ లను ఎత్తుకెళ్లిన కేసులో అజ్మన్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. చోరీ జరిగిన 24 గంటల్లోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేయటం విశేషం. చోరీకి పాల్పడిన వారిలో ముగ్గురు అరబ్బులు ఉండగా ఒకరు గల్ఫ్ దేశస్తుడు. మరో వ్యక్తి ఆసియాకు చెందిన వ్యక్తిగా పోలీసులు వెల్లడించారు. అజ్మన్ పరిధిలోని ఓ మనీ ఎక్సేంజ్ సిబ్బంది..నగదు బదిలీ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి భద్రత లేకుండా డబ్బును తరలించే ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. ఓ సివిలియన్ కారులో డబ్బు తరలిస్తుండటం..పైగా సెక్యూరిటీ కూడా లేకపోవటానికి గమనించిన ముఠా వారిపై దాడికి పాల్పడింది. ఆయుధాలతో బెదిరించి 32,80,000 దిర్హామ్ లను ముఠా ఎత్తుకెళ్లింది. అయితే..ఈ భారీ చోరీ గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దొంగల ముఠా కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ముఠా సభ్యుల్లో ఒకరు అజ్మన్ లో పట్టుబడటంతో మిగిలిన వారి వివరాలను కూడా సేకరించి వారిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!