దుబాయ్ వచ్చే ఇతర ఎమిరేట్ వీసా దారులకు ఐసీఏ అనుమతి తప్పనిసరి

- October 08, 2020 , by Maagulf
దుబాయ్ వచ్చే ఇతర ఎమిరేట్ వీసా దారులకు  ఐసీఏ అనుమతి తప్పనిసరి

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికులకు కొత్త మార్గనిర్దేశకాలను జారీ అయ్యాయి. ఇతర ఎమిరాతి నుంచి రెసిడెన్సీ వీసా పొంది..దుబాయ్ కి చేరుకునే ప్రయాణికులు అంతా పౌర గుర్తింపు అధికార విభాగం నుంచి తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని దుబాయ్ విమానాశ్రయ అధికారులు స్పష్టం చేశారు. అదే సమయంలో దుబాయ్ రెసిడెన్సీ వీసాదారులు కూడా తప్పనిసరిగా ఐసీఏ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని అధికారులు సూచించారు. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న కొందరు ప్రయాణికులు ఈ కొత్త నిబంధనలతో టెర్నినల్ లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని విమానాశ్రయ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన సమయంలో సవరించిన కొత్త నిబంధనల గురించి అధికారులు
వెల్లడించారు. అయితే..నిబంధనల సవరణ విషయం తెలియకపోవటంతో ఇతర ఎమిరాతిల నుంచి రెసిడెన్సీ వీసాదారులు దుబాయ్ విమానాశ్రయానికి చేరుకొని అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం టెర్నినల్ 1, 2 లో వివిధ దేశాల నుంచి వచ్చిన దాదాపు 280 మంది  ప్రయాణికులు చిక్కుకుపోయినట్లు దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం వెల్లడించింది. ఇందులో ఎక్కువ మంది భారతీయులే ఉన్నట్లు తెలుస్తోందన్నారు. తమకు ఉన్న సమాచారం మేరకు టెర్నినల్ 3లో కూడా దాదాపు అంతేమంది చిక్కుకుపోయి ఉంటారని తెలిపారు. వాళ్లంతా దుబాయ్ ఎమిరాతి కాకుండా ఇతర ఎమిరాతిల నుంచి రెసిడెన్సీ వీసాలను పొందినవాళ్లై ఉండొచ్చని చెబుతున్నారు. అయితే..ఇవాళ వాళ్లందర్ని వదిలే అవకాశాలు ఉన్నాయని, ఈ మేరకు అధికారవర్గాల నుంచి తమకు సమాచారం ఉందని దౌత్యకార్యాలయం స్పష్టం చేసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com