ఆరేళ్లుగా ఉద్యోగానికి వెళ్లకుండా జీతం తీసుకుంటున్న కువైట్ డాక్టర్ అరెస్ట్

- October 08, 2020 , by Maagulf
ఆరేళ్లుగా ఉద్యోగానికి వెళ్లకుండా జీతం తీసుకుంటున్న కువైట్ డాక్టర్ అరెస్ట్

కువైట్ సిటీ:ఆరు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కొలువుకు వెళ్లలేదు. కానీ, జీతం మాత్రం ఠంచనుగా తీసుకున్నాడు. కానీ, మోసం ఎక్కువ కాలం దాగదు కదా! అలాగే వన్ ఫైన్ ఆ డాక్టర్ బాగోతం కూడా బయటపడింది. దీంతో బిత్తరపోయిన ఉన్నతాధికారులు..ఒక్క రోజు కూడా ఉద్యోగానికి రాకుండా జీతం ఎలా తీసుకొగలిగాడని ఆరా తీయటంతో ఆ డాక్టర్ కన్నింగ్ వేషాలన్ని వెలుగులోకి వచ్చాయి. ఆస్పత్రిలోని ఉన్నతాధికారి సంతకాన్ని ఫోర్జరీ చేసి..తాను ప్రతి రోజు ఉద్యోగానికి వెళ్తున్నట్లుగా ఆర్ధికశాఖను మోసం చేసినట్లు విచారణలో బయటపడింది. 2010 నుంచి 2016 వరకు ఫోర్జరీ సంతకాలతో జీతం అందుకున్నట్లు నిర్ధారించుకున్నారు. దీంతో ఆ డాక్టర్ను ఫోర్జరీ, చీటింగ్ కేసులలో పోలీసులు అరెస్ట్ చేసి..కేసును పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు సిఫారసు చేశారు. ​

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com