కువైట్‌ క్రౌన్‌ ప్రిన్స్‌గా బాధ్యతలు స్వీకరించిన షేక్‌ మిషాల్‌

- October 08, 2020 , by Maagulf
కువైట్‌ క్రౌన్‌ ప్రిన్స్‌గా బాధ్యతలు స్వీకరించిన షేక్‌ మిషాల్‌

కువైట్‌ సిటీ: షేక్‌ మిషాల్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ జబెర్‌ అల్‌ సబా, నేషనల్‌ అసెంబ్లీ యెదుట కువైట్‌ క్రౌన్‌ ప్రిన్స్‌గా బాధ్యతలు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. కువైట్‌ చట్టాలు, రాజ్యాంగం పట్ల బద్ధుడినై వుంటానని ఆయన ఈ సందర్భంగా పదవీ ప్రమాణం చేయడం జరిగింది. అంతకు ముందు కువైట్‌ నేషనల్‌ అసెంబ్లీ, ఏకగ్రీవంగా షేక్‌ మిషాల్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ సబాహ్‌ను క్రౌన్‌ ప్రిన్స్‌గా ఆమోదించింది. కువైట్‌ ఎమిర్‌ - షేక్‌ నవాఫ్‌ అల్‌ అహ్మద్‌ అల్‌ సబా, షేక్‌ మిషాల్‌ని క్రౌన్‌ ప్రిన్స్‌గా నామినేట్‌ చేశారు. కువైట్‌ రాజ్యాంగం ప్రకారం క్రౌన్‌ ప్రిన్స్‌కి సంబంధించి ఎమిర్‌ నామినేషన్‌ని నేషనల్‌ అసెంబ్లీ ఆమోదించాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com